Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు మెంబర్ల నియామకం దాదాపు ఖరారైంది. మరికాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పాలక మండలి సభ్యుల లిస్టు లో ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీఎస్‌ఎస్ శివాజీ, బొండా ఉమ, వంగలపూడి అనిత, చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్‌బాబు, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మేడా రామచంద్రారెడ్డి, డొక్కా జగన్నాథం, తెలంగాణ నుంచి పెద్దిరెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, కర్ణాటక నుంచి సుధా నారాయణ మూర్తి, మహారాష్ట్రాకు చెందిన స్వప్నను టీటీడీ బోర్డు మెంబర్లగా ప్రభుత్వం నియమించింది ఇందుకు సంబంధించి కాసేపట్లో అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
గత కొద్దిరోజుల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కడప జిల్లా మైదుకూరుకు చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. గతంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా సుధాకర్‌యాదవ్ పనిచేశారు. అయితే బోర్డు సభ్యుల నియామకం జిలా రాజకీయ సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని జరిపినట్టు అర్ధం అవుతోంది. అందులో భాగంగానే శ్రీకాకుళానికి చెందిన గౌతు శివాజీ, కృష్ణాకి చెందిన బోండా ఉమ, విశాఖ కి చెందిన అనిత, అనంత జిల్లాకి చెందిన పార్థసారథిలకు అవకాశం దక్కిందని సమాచారం.