వర్మ ఎన్టీఆర్‌ సినిమాకు టీడీపీ కండీషన్స్‌

tdp-setting-conditions-for-ram-gopal-varma-ntr-biopic-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను ప్రకటించాడు. కాని అందులో కొన్ని సినిమాలను మాత్రమే తెరకెక్కించాడు. ప్రకటించిన ఎన్నో సినిమాలను వర్మ కూడా మర్చి పోయాడు. అందుకే తాజాగా వర్మ ప్రకటించిన ఎన్టీఆర్‌ సినిమాను కూడా అంతే అనుకున్నారు. వర్మ ప్రకటించనైతే ప్రకటించాడు కాని, ఖచ్చితంగా ఎన్టీఆర్‌ సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లడు అని అనుకున్నారు. కాని షాకింగ్‌గా ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర సినిమా స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లుగా వర్మ ప్రకటించి, టైటిల్‌ను కూడా అనౌన్స్‌ చేయడంతో అంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అనే టైటిల్‌తో తాను ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా వర్మ ప్రకటించడంతో పాటు, ఎన్టీఆర్‌కు జరిగిన నమ్మకద్రోహం, ఆ సమయంలో ఎన్టీఆర్‌ పడ్డ క్షోభ అన్ని కూడా తాను చూపిస్తాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. త్వరలోనే షూటింగ్‌ మొదలు పెట్టి వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు ఆ సినిమాను తీసుకు వస్తాము అంటూ వర్మ ప్రకటించడంతో తెలుగు దేశం పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఒక తెలుగు దేశం పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జీవిత కథతో సినిమా తీస్తే ఆ కథను పూర్తిగా మాకు చూపించి, అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సవరించి అప్పుడు మాత్రమే తెరకెక్కించాలని లేదంటే ఆ సినిమాను విడుదల కానిచ్చేది లేదు అంటూ హెచ్చరించాడు. ఎన్టీఆర్‌ తమ సొత్తు అని, అందుకే ఆయన సినిమాపై సర్వ హక్కులు మాకు ఉంటాయని ఆయన అంటున్నాడు. వర్మకు ఇలాంటి హెచ్చరికలు కొత్తేం కాదు, ఖచ్చితంగా వర్మ వీటిని పట్టించుకోకుండా తాను ఏదైతే అనుకున్నాడో అదే తీస్తాడు. ఒకవేళ ఏపీలో బ్యాన్‌ చేస్తే యూట్యూబ్‌లో అయినా విడుద చేసే రకం వర్మ. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.