“‘కంగువా’ టీం అన్‌స్టాపబుల్‌ ప్రమోషన్‌లతో దూసుకెళ్తోంది!”

"Team 'Kangua' rolls out unstoppable promotions!"
"Team 'Kangua' rolls out unstoppable promotions!"

తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’ మూవీ నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ మూవీ ని దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తుండగా, ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేస్తూ చిత్ర యూనిట్ బిజీగా ఉన్నది.

ఈ మూవీ ని తెలుగులో ప్రమోట్ చేసేందుకు ‘కంగువా’ టీమ్ హైదరాబాద్ కి రానుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 24న ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు మేకర్స్. అయితే, దీంతో పాటు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-4’లోనూ ‘కంగువా’ టీమ్ సందడి చేయనుందని తెలుస్తుంది . దీనికి సంబంధించిన షూట్ అక్టోబర్ 24న జరగనుందని తెలుస్తుంది .

"Team 'Kangua' rolls out unstoppable promotions!"
“Team ‘Kangua’ rolls out unstoppable promotions!”

ఇలా తెలుగులోనూ భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసిన ‘కంగువా’ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి.