మొదట కొన్ని రోజులు మాత్రమే అనుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్ తరువాత కొన్ని నెలలకు చేరింది. ఏకంగా రెండు సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోల్ని ఆఫీస్‌లకు ఆహ్వానిస్తున్నాయి. తాజాగా టెక్ మహీంద్రా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగులకు ఘనంగా స్వాగతం పలుకుతోంది.అందుకు సంబంధించిన వీడియోను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా వీడియోల్ని షేర్ చేశారు.
కరోనా కష్టకాలంలో అన్నీరంగాలు కుదేలైతే..ఐటీ రంగం మాత్రం అపరిమిత లాభాలు సాధించింది. దీని కారణం ఐటీ కంపెనీలు అమలు చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే. ఈ పద్దతిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐటీ కార్యకలాపాలు కొనసాగాయి. కానీ ఇప్పుడు కరోనా తగ్గు ముఖం పట్టడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలుపునిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో “ఇన్ని రోజులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న ఉద్యోగుల్ని కార్యాలయాలకు చాలా ఎగ్జైట్‌మెంట్‌తో స్వాగతిస్తున్నాం. మహీంద్రా సంస్థలోని మా సహోద్యోగులు మళ్లీ తిరిగి కార్యాలయాలకు వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారంటూ” ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.