జనరల్ టెడ్రోస్ కి కరోనా పాజిటివ్

జనరల్ టెడ్రోస్ కి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి భారిన పడి లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. రోజుకి లక్షల్లో కరోనా వైరస్ భారిన పడుతున్నారు. అయితే తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అతనొమ్ స్వీయ నిర్బంధం లోకి వెళ్ళారు. అయితే ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ సోకిన వ్యక్తిని కలిసిన విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే తనకు ఎటువంటి కరోనా వైరస్ లక్షణాలు లేవు అని స్పష్టం చేశారు.

అయితే కరోనా వైరస్ లక్షణాలు లేకపోయినా కూడా డబ్ల్యూ హెచ్ ఓ నిబంధనల ప్రకారం కొన్ని రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నట్లు తెలిపారు. అయితే అప్పటివరకు కూడా ఇంటి వద్ద నుండే పని చేస్తా అని వెల్లడించారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడం లో మాత్రమే కాకుండా వాక్సిన్ అభివృద్ది పై సైతం ఇతర దేశాలను సమన్వయ పరచడం లో ఎంతో కృషి చేస్తుంది. వీలైన త్వరగా అన్ని దేశాలకు వాక్సిన్ త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.