యువతిని నరికి చంపిన సోదరుడు

యువతిని నరికి చంపిన సోదరుడు

తమకు ఇష్టంలేని వివాహం చేసుకుందనే అక్కసుతో యువతిని ఆమె తల్లి, సోదరుడు అత్యంత కిరాతకంగా కొడవలితో నరికి చంపారు. ఆమె తలను వేరుచేసి అందరూ చూస్తుండగానే సోదరుడు గాల్లోకి ఎగురువేశాడు. అంతేకాదు, మొండెం నుంచి వేరుచేసిన తలతో తల్లీకొడుకులు సెల్ఫీలు దిగారు. అత్యంత భయానకమైన ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వీర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాయిజ్‌పూర్ చోటుచేసుకున్న ఈ ఘటన చుట్టుపక్కలవారిని భయభ్రాంతులకు గురిచేసింది.

భర్త ఇంటిలోనే ఆమెను హత్యచేసి పోలీసులకు లొంగిపోయారు. అక్కతో పాటు ఆమె భర్తపై కూడా దాడికి యత్నించగా ఆయన తప్పించుకున్నాడు. హతురాలు కీర్తి థోరే ప్రేమించిన యువకుడితో ఈ ఏడాది జూన్‌ 21న ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. దీంతో ఆమె కుటుంబం తీవ్ర వేదనకు గరుయ్యింది. ఈ క్రమంలో గతవారం కీర్తిని కలిసిన ఆమె తల్లి ఇంటికి రావాలని కోరింది. ఆదివారం తన కుమారుడితో కలిసి కూతురు ఇంటికి వచ్చింది. తల్లీ సోదరుడు రావడంతో సంతోషించిన కీర్తి.. వారికి టీ తీసుకురావడానికి వంటింట్లోకి వచ్చింది.

అనారోగ్యంతో కీర్తి భర్తకు వేరే గదిలో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన తల్లీకొడుకులు వంటింట్లోకి వెళ్లి కీర్తిపై దాడిచేశారు. కొడవలితో వచ్చిన సోదరుడు ఆమె తలను నరికేయగా తల్లి కీర్తి కాలు పట్టుకుంది. అనంతరం తలను బయటకు తెచ్చి ఇరుగుపొరుగువారు గాల్లోకి ఎగురవేశారు. అనంతరం పోలీస్ వీర్‌గావ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘‘హతురాలు తల్లి వారం రోజుల కిందట ఆమె ఇంటికి వచ్చింది.. డిసెంబరు 5న కుమారుడితో కలిసి మళ్లీ వెళ్లింది.. వారి ఇల్లు పొలంలో ఉండటంతో అత్తకు కీర్తి పొలం పనిలో సాయం చేస్తోంది.. అమ్మా తమ్ముడు రావడంతో పని వదిలేసి పరుగున వచ్చి పలకరించింది.. తొలుత తాగడానికి నీళ్లిచ్చిన ఆమె.. టీ కాచిపెట్టడానికి వంటింట్లోకి వెళ్లింది.. ఈ సమయంలోనే ఇద్దరూ దాడిచేసి హత్యచేశారు’’ అని స్థానిక పోలీస్ అధికారి కైలాస్ ప్రజాపతి తెలిపారు.

కీర్తి భర్త అనారోగ్యానికి గురికావడంతో ఓ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడని, వంటింట్లో శబ్దం రావడంతో వెళ్లాడన్నారు. అతడిని కూడా చంపడానికి కీర్తి తమ్ముడు ప్రయత్నించాడు కానీ తప్పించుకున్నాడుని తెలిపారు. ప్రస్తుతం కీర్తి నాలుగో నెల గర్భవతిని పోలీసులు చెప్పారు. మరాఠా సినిమాను సైరత్‌ను ప్రేరణగా తీసుకుని బాలుడు హత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు.