పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మల్లన్న ఈరోజు మీడియాతో మాట్లాడుతూ… తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయించి రేవంత్ రెడ్డి చాలా పెద్ద పొరపాటు చేశారని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో.. చూస్తామన్నారు. ‘‘నన్ను సస్పెండ్ చేస్తే.. బీసీ ఉద్యమం ఆగిపోతుందన్న భ్రమలోంచి రేవంత్ బయటకు రావాలి. నాలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే కుల గణనను తప్పుగా చూపారు. రేవంత్ చేసిన కులగణన చిత్తు కాగితంతో సమానం. సొంత మంత్రులకే ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రావటం లేదు’’ అంటు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.


