తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

తీన్మార్‌ మల్లన్న
తీన్మార్‌ మల్లన్న

బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీసీలను కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నుంచి గ్రామ గ్రామానికి బీసీ వాదాన్ని తీసుకెళ్తామని, బీసీ మేధావులతో చర్చించి భవిషత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని పత్రాలు తగులబెడితే తనను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా అని ప్రశ్నించారు.