తేజా స‌జ్జా సినిమా నెక్స్ట్ సినిమా..‘మిరాయ్‌’..?

తేజా స‌జ్జా సినిమా నెక్స్ట్ సినిమా..‘మిరాయ్‌’..?
Cinema News

హ‌నుమాన్‌’తో ఓ పాన్ ఇండియా హిట్టు అందుకొన్నాడు తేజా స‌జ్జా. ఈ సంక్రాంతి సినిమాల్లో… హ‌నుమాన్ దే హ‌వా. ‘హ‌నుమాన్’ త‌ర‌వాత తేజా ఎలాంటి సినిమా చేస్తాడు? అనే విష‌యంలో ఆస‌క్తి నెల‌కొంది. నిజానికి ‘హ‌నుమాన్‌’తో స‌మాంత‌రంగా తేజా ఓ సినిమాని ప‌ట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌కుడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మిస్తోంది.

కొంత మేర షూటింగ్ జ‌రిగింది. ఇదో మ‌ల్టీస్టార‌ర్ సినిమా. ఇందులో దుల్క‌ర్ స‌ల్మాన్‌, మంచు మ‌నోజ్ లు కూడా క‌నిపిస్తారని తెలుగు 360 ముందే చెప్పింది. ఈ చిత్రానికి ‘మిరాయ్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ‘మిరాయ్‌’ అంటే ఆయుధం అనే అర్థం ఉంద‌ట‌. ఇదో యాక్ష‌న్ ఎడ్వైంచ‌ర్ సినిమా అని తెలుస్తోంది. బ‌డ్జెట్ కూడా భారీగానే ఉండ‌బోతోంది. ‘హ‌నుమాన్‌’ కేవ‌లం రూ.27 కోట్ల‌లో తీశారు.

తేజా స‌జ్జా సినిమా నెక్స్ట్ సినిమా..‘మిరాయ్‌’..?
Teja Sajja’s next movie..’Mirai’..?

‘మిరాయ్‌’కి అటూ ఇటుగా రూ.40 కోట్లు అవుతుంద‌ని టాక్‌. ‘హ‌నుమాన్‌’తో తేజా రేంజ్ మారింది. పైగా ఈ సినిమాలో దుల్క‌ర్‌, మ‌నోజ్‌లు కూడా ఉన్నారు. కాబ‌ట్టి రూ.40 కోట్లు పెట్ట‌డంలో త‌ప్పేం లేదు. ‘మిరాయ్‌’తో పాటుగా తేజా మ‌రో సినిమా కూడా చేయ‌బోతున్నాడు. న‌క్కిన త్రినాథ‌రావు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌వ‌కాశాలు ఉన్నాయి. రాజేష్ దండా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ ప్రాజెక్ట్ ఫైన‌ల్ డిస్క‌ర్ష‌న్‌లో ఉంది. ఈవారంలోనే ఓ క్లారిటీ వ‌స్తుంది.