తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 ఆసక్తికరంగా సాగుతూ ఉంది. మొదటి మూడు వారాల ఎలిమినేషన్ సాదా సీదాగా సాగింది. ముందుగా ఊహించిన ప్రకారం క్రేజ్‌లేని ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. నాల్గవ వారం నుండి ఎలిమినేషన్స్ చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. కనీసం ఆరు ఏడు వారాలు అయినా ఉంటుందని భావించిన శ్యామల షాకింగ్‌గా నాల్గవ వారం ఎలిమినేట్ అయ్యింది. ఇక అయిద వారంలో భాను శ్రీ బయటకు వచ్చేసింది. భాను శ్రీ కూడా తప్పకుండా చాలా వారాలు ఇంట్లో కొనసాగుతుందని ఆశించారు. కాని ఆమె అనూహ్యంగా బయటకు వచ్చేసింది. ఇక తాజాగా ఈ వారం కూడా మరింత షాకింగ్ ఎలిమినేషన్ అయ్యింది. ఫైనల్ వరకు వెళ్లగల సత్తా ఉన్న పార్టిసిపెంట్ అంటూ తేజస్విపై మొదటి నుండి నమ్మకం పెట్టుకున్నారు.
ఫైనల్ వరకు వెళ్లే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తేజస్వి ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యంగా ఉంది. గత వారం నామినేషన్స్‌లో టీవీ9 దీప్తి, తనీష్, రోల్ రైడా, సామ్రాట్, తేజస్వి ఉన్నారు. ఈ అయిదుగురిలో ఖచ్చితంగా తేజస్వికి క్రేజ్ ఎక్కువ కనుక ముందే సేవ్ అవుతుందని భావించారు. కాని అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా తేజస్వి బయటకు వచ్చేసింది. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామాలపై విశ్లేషకులు కూడా నోరు వెళ్లబెడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే అసలు బిగ్‌బాస్ ఓటింగ్ విధానంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతా సజావుగా సాగుతుందా లేదంటే నిర్వాహకులు ఏమైనా మతలబు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి రెండు మూడు వారాలు తేజస్వి ప్రవర్తన కాస్త ర్యాష్‌గా ఉన్నా గడచి రెండు వారాలుగా అయితే ఆమె చాలా సౌమ్యంగా కనిపించింది. సామ్రాట్‌తో ఆమె లవ్ జర్నీ హాపీగా సాగుతుంది. ఇలాంటి సమయంలో సామ్రాట్‌ను ఒంటరిగా వదిలేసి తేజస్వి బయటకు వచ్చేసింది. తేజస్వి ఎలిమినేషన్ సమయంలో సామ్రాట్ కన్నీరు పెట్టుకోవడం అందరిని కదిలించింది.