తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల..

Telangana assembly election final voter list released..
Telangana assembly election final voter list released..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఎన్నికల కమిషన్. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3 కోట్ల, 17లక్షల, 17వేల,389 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1కోటి 58 లక్షల 71 వేల 493, మహిళలు 1కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్స్ 2,557 మంది ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన భాగంగా 22 లక్షల 2వేల 168 మందిని తొలగించారు.

ఓవర్సీస్ 2,780 మంది కలరు. సర్వీస్ ఓటర్లు 15, 338 మంది ఓటర్లు కలరు. సెప్టెంబర్ 19 వరకు అందిన దరఖాస్తులన్నింటినీ సెప్టెంబర్ 27 లోగా పరిష్కరించి ఖరారైన తుది జాబితాను అక్టోబర్ 4న ప్రకటించారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 14.72 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదు కాగా, 3.39 లక్షల మందిని తొలగించారు. 10.95 లక్షలమంది ఓటర్ల వివరాలలో మార్పులు చేశారు. స్త్రీ పురుష నిష్పత్తి 994గా, ఓటరు, జనాభా నిష్ఫత్తి (2023 వరకు) 696గా తేలింది.