తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ వైరల్ ఫివర్, దగ్గుతో బాధపడుతున్నారు . దీంతో ప్రగతిభవన్ లోనే సీఎం కేసీఆర్ కు యశోదా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు వైద్యుల బృందం సీఎం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఫీవర్ తగ్గేవరకు అక్కడే వైద్యులు ఉండనున్నారు.
దీంతో సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని, కొద్ది రోజుల్లోనే కేసీఆర్ సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారని, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ తరుణంలోనే.. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రగతి భవన్ చేరుకుని.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసారు. కాగా.. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం బా గానే ఉన్నారని తెలుస్తోంది.