నేడే తెలంగాణా సంబురం !

telangana formation day celebrations today

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నేటికి నాలుగేళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది తెరాస స‌ర్కారు. రాష్ట్ర సాధ‌న పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ నాలుగేళ్ల‌లో సాధించిన అభివృద్ధి, సంక్షేమం గురించి ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి వివ‌రించ‌నున్నారు. ఆవిర్భావ వేడుక‌ల‌ను భాగ్యన‌గ‌రాన్ని సుంద‌రంగా అలంక‌రించారు. ఈ వేడుక‌ల్లో భాగంగా ముగ్గురు పోలీసు అధికారుల‌కు స‌ర్వోన్న‌త ప‌త‌కాల‌ను ఇవ్వనున్నట్టు సమాచారం. తెలంగాణ ఏర్ప‌డ్డ త‌రువాత కేసీఆర్ స‌ర్కారు వ్య‌వ‌సాయానికి ప్రాధాన్య‌త ఇచ్చిన్నట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఎన్నికలు ఏడాది ఉండగా తాజాగా ప్ర‌క‌టించిన రైతు బంధు ప‌థ‌క‌మే అందుకు సాక్ష్యం. ఇకపోతే నీటిపారుద‌ల ప్రాజెక్టులు కూడా భారీగానీ చేప‌ట్టింది. రూ. 2.6 ల‌క్షల కోట్ల వ్య‌యంతో నీటి పారుద‌ల ప్రాజెక్టుల నిర్మాణం జ‌రుగుతోంది. 46 వేల చెరువుల‌ను పున‌రుద్ధ‌రించేందుకు కాక‌తీయ మిష‌న్ ను తీసుకొచ్చారు.

పారిశ్రామికంగా చూసుకుంటే ద‌ర‌ఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అన్ని ర‌కాల అనుమతులూ వ‌చ్చే విధంగా సుల‌భమైన పారిశ్రామిక విధానాన్ని(సింగిల్ విండో పద్ధతిని) తీసుకొచ్చారు తీసుకొచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబ‌ర్ వ‌న్ స్థానం తెలంగాణ ద‌క్కించుకుంది. ఒకరకంగా చెపాలంటే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలోనే తెలంగాణా ప్రజల్లో ఒకరకమయిన భావన రేపి అది ఇప్పటిదాకా ఆంధ్రా వారే దోచుకున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తన విజయాన్ని నల్ల్లేరు మీద నడకలా చేసుకున్నారు కేసీఆర్. కొత్త రాష్ట్రం వ‌చ్చాక కూడా ఇవి ఆశించిన స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ఇంకా ద‌క్క‌లేద‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌తిప‌క్షాలు చేస్తున్నాయి. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెడితే గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో తెలంగాణ కొంతమేరకు అయినా అభివ్రిద్ది ఫలాలను అందుకుందనే చెప్పాలి(రోడ్లను మినహాయించి). ఇక ఇవే విషయాల్ని కేసీఆర్ మరో మారు ప్రజల ముందు ఏకరవు పెట్టనున్నారు.