రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది.
మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించేలా ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. కాగా, తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కి చేరుకుంది. మృతుల సంఖ్య 375కి పెరిగింది.