తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరొక కీలకమైన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరొక కీలకమైన నిర్ణయం

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్టీసీ సమ్మే ని ఎట్టకేలకు విరమించుకుని, తమ తమ విధుల్లో నిమగ్నమైనటువంటి ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరొక షాక్ ఇచ్చింది. కాగా రాష్ట్రంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ని తిరిగి లాభాల బాట పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. కాగా నష్టాలను తగ్గించడానికి గాను, నగరంలో ఆర్టీసీ సర్వీసులను తగ్గించడానికి ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ప్రణాళికలు సిద్ధం చేసిందని వార్తలు వస్తున్నాయి.

కాగా ప్రస్తుతానికి నగరంలో నడుస్తున్నటువంటి 3750 బస్సుల్లోంచి, ఒక వెయ్యి బస్సులను తగ్గించడానికి నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. అయితే పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ఇంకా సర్వీసులను పెంచాల్సింది పోయి, తగ్గించడం అనేది ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారిందని సమాచారం. అయితే ఇలా సర్వీసులను తగ్గించడం వలన, కార్మికులను కూడా తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం, అందువలన కొంతలో కొంతైనా లాభాలను రాబట్టవొచ్చనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం.