నాయకులని రెచ్చగొట్టడం ఎలాగో జనానికి తెలుసు.

Telangana job less youth counter to cm kcr about TSPSC job notification

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కులం, మతం, ప్రాంతం… ఇలా కొన్ని అంశాలను పట్టుకుని రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోడానికి నాయకులు ఎన్ని ఎత్తులు వేస్తారో చెప్పే పని లేదు. కొందరు నాయకులు చేసే ఈ పనుల వల్లే దేశానికి దశ, దిశ నిర్దేశించే రాజకీయ వ్యవస్థనే మొత్తంగా చిన్నచూపు చూసే పరిస్థితి ఏర్పడింది. జనాన్ని రెచ్చగొట్టి నాయకులు పబ్బం గడుపుకోవడం ఒక ఎత్తు అయితే ప్రజలే నాయకులను రెచ్చగొట్టి తమ పనులు చేయించుకోవడం అనే కొత్త ట్రెండ్ కూడా ఈ మధ్య మొదలైంది. ఈ ఎత్తుగడ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫలితం కూడా ఇస్తోంది. అదెలాగో చూద్దాం.

chandra-babu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా D.Sc. నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ఈ నోటిఫికేషన్ రాగానే ఆంధ్రాలో నిరుద్యోగులు పండగ చేసుకోవడంలో అర్ధం వుంది. కానీ తెలంగాణ యువత సైతం బాబు చిత్ర పటానికి పాలాభిషేకాలు చేశారు. ఇది నిజంగా బాబు మీద అభిమానంతో జరిగిన పాలాభిషేకం అనుకుంటే పొరపాటే. తెలంగాణాలో ఉద్యోగాల భర్తీకి డిమాండ్ చేస్తున్న యువత సీఎం కెసిఆర్ ని రెచ్చగొట్టడానికి ఎంచుకున్న మార్గం. పక్క రాష్ట్రం సీఎం కి అభిషేకాలు అనగానే ఏ నాయకుడికి అయినా ఇగో దెబ్బ తింటుంది కదా . కరెక్ట్ గా అదే పాయింట్ మీద యూత్ తన గేమ్ ప్లే చేసింది.

kcr

గతంలో ఉద్యోగులు సైతం ఇదే ప్లాన్ తో తమ పని చేయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే పీఆర్సీ వ్యవహారంలో మిగులు బడ్జెట్ తో వున్న తెలంగాణ సీఎం కెసిఆర్ ఉదారంగా నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఉద్యోగులు జై కొట్టడం చూసి లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ జీతాల పెంపులో తెలంగాణతో సమానంగా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆపై ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు అక్కడి భూములు విలువ పెరగడానికి కారణం అయిన విభజనకు పోరాటం చేసిన కెసిఆర్ కి అభిషేకాలు చేసిన సంఘటనలు వున్నాయి. బాబు హైదరాబాద్ నుంచి అమరావతి తరలిపోవడానికి ఇలాంటి ఘటనలు కూడా పని చేశాయి. మొత్తానికి జనాన్ని ఓ రకంగా నాయకులు రెచ్చగొడుతుంటే , నాయకులని ఇంకో రకంగా జనం రెచ్చగొట్టి పనులు చేయించుకుంటున్నారు. ఇక్కడ కూడా యధా రాజా, తధా ప్రజ అనుకోవచ్చేమో.