Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Telangana RTC kept for sale
తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లోనే ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. అందుకే ఏపీ కార్యాలయాలు ఖాళీ చేసిన ఎంజీబీఎస్ లో కొంత బాగాన్ని కార్పొరేట్ సంస్థలకు అద్దెకివ్వాలని అధికారులు భావిస్తున్నారు. అయితే మొదట లీజుకిచ్చి, తర్వాత శాశ్వతంగా అమ్మేయాలనే ఆలోచన ఉందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
ఏపీ ఆర్టీసీ విజయవాడకు వెళ్లిపోయాక.. బస్ భవన్లో ఏ బ్లాక్ ఖాళీ అయింది. ఇప్పుడక్కడ టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ ఛాంబర్ తో పాటు.. ఏపీకి చెందిన రెండు విభాగాలే ఉన్నాయి. ఏపీకి డబ్బు ముట్టజెబితే ఆ రెండు విభాగాలు ఖాలీ అవుతాయని, ఛైర్మన్ ఛాంబర్ తో పాటు ఎంజీబీఎస్ స్టేషన్ అధికారుల ఛాంబర్లను జూబ్లీ స్టేషన్ కు తరలించి, ఏ బ్లాక్ ను రిలయెన్స్ కు అద్దెకివ్వాలని అధికారులు ఆలోచనకు తుదిరూపు ఇచ్చారు.
నగరం నడిబొడ్డున ఉన్న బస్ భవన్ అద్దెకు తీసుకోవడానికి రిలయెన్స్ సుముఖత వ్యక్తం చేయడంతో ఇక చిక్కేమీ లేనట్లే. అయితే కార్మిక సంఘాలు మాత్రం మెల్లగా ఆర్టీసీని అమ్మేయడానికే రిలయన్స్ తో రంగప్రవేశం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే అద్దెకివ్వాలనేది ఆలోచన మాత్రమేనని, కంగారు అక్కర్లేదంటున్నారు అధికారులు.