తెలంగాణ ముస్లింలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ముస్లిం మైనార్టీలకు మోడల్ స్మశాన వాటికల నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 125 ఎకరాలను కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ వక్స్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ మరియు సీఈవో ఖాజా మొయినుద్దీన్ లకు స్థలాల కేటాయింపు పత్రాలు మంత్రి కేటీఆర్ అందజేశారు.
ముస్లిం స్మశాన వాటికల నిర్మాణం కోసం 125 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని ఏడాది ఆగస్టు ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏమైనా అధినేత అసదుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అభ్యర్థుల మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. స్మశాన వాటికల నిర్మాణానికి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో భూములు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా మజీద్ పూర్ లో 22 ఎకరాలు ఖానాపూర్ లో 42 ఎకరాలు… మిగతాది మేడ్చల్ జిల్లాలో అలాగే తుర్కపల్లిలో మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.