ఆగష్టు నెలాఖరు నుంచి బిగ్ బాస్ షో మొదలు

ఆగష్టు నెలాఖరు నుంచి బిగ్ బాస్ షో మొదలు

బిగ్ బాస్ షో అయినా మొదలైతే కాస్త కాలక్షేపం అవుతుందని క్రికెట్, సినిమాలు లేక ఊసుపోని జనం ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న వేళ షో మొదలు పెట్టడానికి నాగార్జున సుముఖంగా లేరని సమాచారం. కొన్ని టీవీ సీరియల్స్, కొన్ని షోస్ ఆల్రెడీ మొదలయ్యాయి. వాటితో పోలిస్తే బిగ్ బాస్ నిర్వహణ ఈజీ. ఎందుకంటే ఆ హౌస్ లోపలకు ఒక్కసారి వెళ్లినవాళ్ళు బయటకు వచ్చే పని ఉండదు.

కాబట్టి లోనికెళ్ళే వాళ్లకు ఒకటికి నాలుగు సార్లు పరీక్షలు జరిపించి పంపించి… లోపల ఉన్నపుడు కూడా క్రమం తప్పకుండా టెస్టులు చేస్తూ వుంటే సమస్యలు రావు. అలా ఫిజికల్ టాస్కులు పెట్టుకోవడానికి కూడా ఇబ్బందులు ఉండవు. వీకెండ్స్ లో వచ్చే స్టూడియో ఆడియన్స్ ని రిస్ట్రిక్ట్ చేసుకుని, అలాగే బిగ్ బాస్ స్టాఫ్ కి కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకుంటే గొడవ ఉండదు. అయితే ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద రచ్చ జరుగుతుందని, అందులోను ఈ షో బ్యాన్ చేయాలని గోల చేసే వాళ్ళు ఈ అవకాశం వాడుకుంటారని జంకుతున్నారట. అయితే ఆగష్టు నెలాఖరు నుంచి ఈ షో మొదలవుతుందని వార్తలొస్తున్నాయి.