ప్రజల పక్షాన పనిచేసేందుకు అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు దండగ అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారని చంద్రబాబు, స్పీకర్ విమర్శిస్తే..తెలంగాణలో కేసీఆర్ తీరును ఎండగట్టారు సీఎం రేవంత్. అసెంబ్లీ అటెండెన్స్ అంశంలో ఇటు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ అయిన నేపథ్యంలో భవిష్యత్‌లోనైనా వీరి తీరు మారుతుందో లేదో చూడాలి.