సీరియల్ నటి సూసైడ్ మిస్టరీ….ఎన్నో అనుమానాలు…?

1Shocking Facts Reveal About Jhansi Suicide

వర్ధమాన టీవీ నటి ఝాన్సీ తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని, సూర్య అలియాస్ నాని అనే యువకుడు మోసం చేసినట్టు ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఆత్మహత్యకు ముందు సూర్యతో వాట్సాప్‌లో ఝాన్సీ చాటింగ్ చేయడమే కాక, వారిద్దరూ కలుసుకున్నారని, ఆపైనే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధరించారు. సూర్యతో మంగళవారం ఉదయం ఝాన్సీ కలవగా, సూర్యల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలియడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలిలో ఝాన్సీ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దానిని అన్ లాక్‌ చేయడానికి సైబర్ నిపుణులను సంప్రదించారు.

మరోవైపు, కుమార్తె ఆత్మహత్య విషయం తెలిసిన ఝాన్సీ తల్లి భోరున విలపిస్తున్నారు. కుమార్తె ప్రేమ వ్యవహారం తనకు తెలియదని, కొద్ది రోజుల నుంచి చిరాగ్గా ఉందని చెప్పి షూటింగ్‌‌కు కూడా వెళ్లడంలేదని ఆమె తెలియజేశారు. అయితే సూర్య అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు.కానీ తండ్రికి తెలిసిన విషయం తల్లికి తెలియకపోవడం అనేది కాస్త ఆశ్చర్య పరిచే విషయమే. అద్జీ కాక ఝాన్సీ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఝాన్సీ బలవంతపెట్టడంతో సూర్య ఆమెను దూరం పెట్టాడని, సీరియల్‌ అవకాశాలు కోల్పోయి, మరోవైపు సూర్య మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుందని చెబుతుండగా మరోపక్క ఝాన్సీ సూర్యతో సహజీవనం కూడా చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే పది రోజుల కిందటే ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని ఝాన్సీ చెప్పిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనపడడం లేదు.