అంజలి సీబీఐ ఆఫీసర్ అట !

'Imaikkaa Nodigal' in Telugu as 'Anjali CBI Officer'

తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ కేరళ కుట్టి ఆ తరవాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడం మొదలుపెట్టారు. అలాగే లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’లో సిద్ధమ్మగా నయనతార నటిస్తున్నారు. తెలుగులో నయతారకు ఉన్న ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి తమిళంలో సూపర్ హిట్ అయిన ఆమె చిత్రాలను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు మేకర్స్.

నయనతార కలెక్టర్‌గా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అరమ్’ తెలుగులో ‘కర్తవ్యం’గా విడుదలైంది. ఇప్పుడు నయనతార ప్రధాన పాత్రలో నటించిన మరో చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నయనతా సీబీఐ ఆఫీసర్‌గా నటించిన తమిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ఈ చిత్రంలో అథ‌ర్వ, రాశీఖ‌న్నా కీల‌క పాత్రల్లో న‌టించ‌గా బాలీవుడ్ ద‌ర్శకుడు అనురాగ్ క‌శ్యప్ ప్రతినాయకుడిగా న‌టించారు. ప్రముఖ హీరో విజ‌య్ సేతుప‌తి విక్రమాదిత్య అనే అతిథి పాత్రలో కనిపించారు. న‌య‌న‌తార భ‌ర్త పాత్ర ఇది. ఫిబ్రవ‌రి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.