బీజేపీ మొఖాన చాచి కొట్టిన తెలుగు ఓటరు

telugu voters gives shock treatment to bjp in karnataka

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు వోటర్ల ప్రభావం అన్ని పార్టీల కంటే బీజేపీ మీదనే పడిందని చెప్పాలి. నిజానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశాయనే చెప్పాలి. కాంగ్రెస్ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే…బీజేపీ మాత్రం హోదా హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కింది. అయితే రాష్ట్రాన్ని అడ్డంగా ముక్కలు చేసిన పాపానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని ఏపీలో భూస్థాపితం చేశారు. ఇపుడు బీజేపీని కర్ణాటకలో మట్టికరిపించారు అని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కారు చేసిన అన్యాయంపై మోడీ అండ్ కో పట్ల యావత్ తెలుగు వాళ్ళు ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే.

హోదా విషయంలో మోడీ చేసిన మోసం తెలిసి తెలుగువారంతా ఏకమయ్యారని చెప్పాలి. ఎప్పుడు ఆంధ్రా వారె మాకు పోటీ అనుకునే తెలంగాణ వాసులు సైతం ఏపీకి హోదా ఇవ్వటం సబబు అని వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో బీజేపీకి తెలుగు ఓటర్లు జైకొట్టి ఉంటే.. ఆ పార్టీ విజయం నల్లేరుపై నడకలా సాగేది. కానీ, తెలుగు ఓటర్లు చాచి కొట్టడంతో బీజేపీ మొఖం వాచిందనే చెప్పాలి. బళ్లారి, రాయ్‌చూర్, కొప్పళ్, కలబురిగి, బీదర్, గ్రేటర్ బెంగుళూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 67 అసెంబ్లీ సీట్లు ఉండగా, వీటిలో బీజేపీ కేవలం 26 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని కాంగ్రెస్ పార్టీ 34 సీట్లలోనూ, జేడీఎస్ 7 సీట్లలో విజయం సాధించడం గమనార్హం.

బీజేపీ మొఖాన చాచి కొట్టిన తెలుగు ఓటరు - Telugu Bullet

బళ్లారి జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ ఆరింటిలో జయకేతనం ఎగరవేసింది. బీజేపీ 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక కోలార్ జిల్లాలో బీజేపీ అసలు ఖాతా తెరవలేకపోయింది. ఈ జిల్లాలోని 6 స్థానాలకు గాను కాంగ్రెస్ 4, జేడీఎస్ 1, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక 7 స్థానాలున్న రాయచూర్‌లో కాంగ్రెస్ 3, జేడీఎస్ 2 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. చిక్‌బళ్లాపూర్‌లో మొత్తం 5 స్థానాలకు గాను కాంగ్రెస్ 4 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. మరో స్థానం జేడీఎస్ తన ఖాతాలో వేసుకోగా.. బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. ఇక 9 అసెంబ్లీ స్థానాలున్న గుల్బర్గా జిల్లా పరిస్థితి కాస్త భిన్నం. ఈ జిల్లాలో సగం ప్రాంతంలో మాత్రమే తెలుగువారు అధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ ఆధిక్యం స్పష్టంగా కనిపించగా.. కన్నడిగులు ఎక్కువగా ఉండే మరో సగం ప్రాంతంలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. గుల్బర్గాలో బీజేపీకి 5, కాంగ్రెస్‌కు 4 స్థానాలు దక్కాయి.

తెలుగు ప్రజల ప్రభావం ఉన్న పై 5 జిల్లాల్లో మొత్తం 36 స్థానాలకు గాను 26 స్థానాల్లో బీజేపీ ఓటమిపాలైంది. ఇది ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ప్రభావం చూపింది. కర్ణాటక ఫలితాల్లో బీజేపీకి దక్కిన స్థానాలు 104. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ పార్టీకి కావాల్సిన స్థానాలు 9. అందువల్ల పైన పేర్కొన్న 5 జిల్లాల్లో మరో 9 స్థానాలు కైవసం చేసుకొని ఉంటే బీజేపీకి అధికారం దక్కేదే. జిల్లాల్లో బీజేపీ ఓట్లకు భారీ స్థాయిలో గండిపడింది. తెలుగువారి వ్యతిరేకత కానీ లేని పక్షంలో బీజేపీ సునాయాసంగా అధికారాన్ని చేపట్టేదని చెబుతున్నారు. ఒకవేళ ఆంధ్రోళ్లతో బీజేపీకి పంచాయితీ లేని పక్షంలో తక్కువలో తక్కువ 15-20 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు వారితో సున్నం పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. దానికి చరిత్రే సాక్ష్యం. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ని నామరూపాల్లేకుండా చేసిన తెలుగు వోటరు ఇప్పుడు మోడీ పనీ పట్టాడు. ఇప్పటికైనా తెలుగోళ్లతో సున్నం పెట్టుకోవటం ఆపేసి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హోదా హామీని నెరవేరిస్తే మంచిదని.. ఇప్పుడు కన్నడనాట దెబ్బ తిన్నాం కదా అని మరల తెలుగు వారి మీద కక్ష్య సాధింపు చర్యలకి దిగితే అది అది బీజేపీకే నష్టమంటున్నారు విశ్లేషకులు.