Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనుకున్నదే అయ్యింది, గత కొద్ది రోజుల క్రితం సుమారు 15 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ బోర్డర్ దాటి ఇండియాలోకి ఎంటర్ అయ్యారు అని ఇంటెలిజన్స్ హెచ్చరించిందో లేదో వారు కాశ్మీర్లో తమ పంజా విసిరారు. పోలీసులే లక్ష్యంగా గ్రనేట్ దాడి చేశారు. జమ్ము కాశ్మీర్‌లోని సోపియాన్ జిల్లా బతపోరా చౌక్ వద్ద ఉగ్రవాదులు పోలీస్ పార్టీపై గ్రనేట్ విసిరారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు సహా మొత్తం 16 మంది గాయపడ్డారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అటు బారాముల్లా యొక్క సోపోర్‌లో పోలీసులు పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేశారు. ఇది తీవ్రవాదుల చర్యగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలో.. ఈ గ్రనేట్ దాడులు వరుసగా జరుగుతుండటం పట్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఆందోళన చెందుతున్నారు.