రైతు బిడ్డకు ఊహించని దెబ్బ.. కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్

రైతు బిడ్డకు ఊహించని దెబ్బ.. కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్
latest News

బిగ్ బాస్ 7 లో మొదటి కెప్టెన్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎంపికైన విషయం అందరికి తెలిసిందే. టాస్క్ లో కష్టపడి ఆడి ప్రేక్షకులను మనసులు గెలుచుకున్న ప్రశాంత్ మొదటి కెప్టెన్ అయ్యి అందరిని ఆశ్చర్య పరిచాడు. అయితే మనోడు పేరుకే కెప్టెన్ కానీ ఆ లక్షణాలు ప్రశాంత్ లో అసలు కనిపించడం లేదు. నిన్నటికి నిన్న బిగ్ బాస్ కూడా హౌస్ లో కెప్టెన్ గా ఉన్నాడా.. ? ప్రశాంత్ మీరు కెప్టెన్ అన్న విషయం మరిచిపోయాను అని అంటూ సాలిడ్ పంచ్ వేశాడు. కెప్టెన్ గా ప్రశాంత్ తనకు ఇచ్చిన బాధ్యతలను సరిగ్గా నిర్వత్హించడం లేదు. కంటెస్టెంట్ గా ఉన్నప్పుడే ప్రశాంత్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ అయ్యిన తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.

Video Link : https://www.youtube.com/watch?v=IbA0yEgVFcI

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ప్రశాంత్ కెప్టెన్సీని బిగ్ బాస్ తిరిగి తీసుకున్నట్టు చూపించారు. ప్రేమో వీడియోలో ముందుగా ప్రశాంత్ తన కెప్టెన్సీ బ్యాడ్జ్ ను తనకు ఇచ్చిన మొక్క దగ్గర పెట్టేసాడు దానికి శివాజీ పర్మిషన్ కూడా అడిగాడు. దానికి శివాజీ గారు నిన్నెవ్వర్రా ఆపేది అనడంతో తన బ్యాడ్జ్ ను మొక్క దగ్గర పెట్టి మురిసిపోయాడు. ఆ తర్వాత అందరిని కూర్చోబెట్టి కెప్టెన్ కు ఉండవలసిన లక్షణాలు ఏంటి అని అడిగాడు బిగ్ బాస్.

రైతు బిడ్డకు ఊహించని దెబ్బ.. కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్
Bigg Boss Season-7

అయితే శోభా శెట్టి కెప్టెన్ అనేవాడు అందరిని కంట్రోల్ లో పెట్టుకోవాలి అని చెప్పింది. ఆ తర్వాత అమర్ దీప్ లీడర్షిప్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి అని అన్నాడు . సందీప్ హౌస్ లో ఉన్న వారిని మ్యానేజ్ చేయాలనీ, అర్జున్ అంబటి కెప్టెన్ అంటే హౌస్ లో రెండో బిగ్ బాస్ అని అన్నాడు . ఇక శివాజీ ఇక్కడ ఎబిలిటీస్ ఇంపార్టెంట్ అని అన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ ను మంచి కెప్టెన్ కు ఉండవలసిన లక్షణాలు ఏంటి అని అడిగాడు బిగ్ బాస్. దానికి నేను పని చేస్తూ.. వాళ్ళతో పనిచేయించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు నా మాట వినడంలేదు.. కొన్ని పనులు చెప్పినా కూడా వీడెంటి అన్నట్టు చూశారు అని చెప్పుకున్నాడు ప్రశాంత్. ఇక ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడగ్గా.. అందరు చేయి పైకి లేపారు. దాంతో ప్రశాంత్ నుంచి కెప్టెన్ బ్యాడ్జ్ ని తిరిగి తీసేసుకున్నాడు బిగ్ బాస్. దాంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి ఉన్నది .