తెలంగాణను ఆత్మహత్యల్లో, నిరుద్యోగంలో, కుంభ కోణాల్లో నెంబర్ వన్ చేశారు: అమిత్ షా

Telangana is number one in suicides, unemployment and Aquarius angles: Amit Shah
Telangana is number one in suicides, unemployment and Aquarius angles: Amit Shah

కేసీఆర్ లక్ష్యం ఒక్కటేనని అది కూడా కేటీఆర్ ని సీఎం చేయడమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇవాళ ఆదిలాబాద్ జనగర్జన సభలో పలు ఆసక్తికర విషయాలను అమిత్ షా మాట్లాడారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఆదివాసులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి. తెలంగాణను నిరుద్యోగంలో, కుంభ కోణాల్లో,ఆత్మహత్యల్లో నెంబర్ వన్ చేశారు. తెలంగాణలో గత పదేళ్లలో కేసీఆర్ పేదలు, రైతులకు ఒరిగింది ఏం లేదన్నారు. కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు.

సీఎం కాక ముందు దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానన్నారు. ఆ తరువాత దళితుడి ముఖ్యమంత్రి ఏమైందని ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళిత బంధును ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం తెలంగాణకు కృష్ణా ట్రిబ్యునల్, గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. డిసెంబర్ 03న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అమిత్ షా జోస్యం చెప్పారు. మోడీ ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. గిరిజన యూనివర్సిటీకీ కేసీఆర్ ప్రభుత్వం స్థలం కూడా చూపించడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.