TG Politics: ఎకరానికి 10వేలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం..?

TG Politics: 10 thousand per acre.. Telangana state government's decision..?
TG Politics: 10 thousand per acre.. Telangana state government's decision..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రైతన్నలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లితోంది.. ముఖ్యంగా చేతికి వచ్చిన వరి పంట.. నేల రాలుతోంది. అటు మామిడి తోటల్లో కూడా వడగండ్ల వాన కారణంగా మామిడికాయలు రాలిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రైతన్నలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్తోంది.. అయితే వడగండ్ల వాన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పంట నష్టం జరిగిన రైతులను ఆదుకునేందుకు సిద్ధమవుతోంది. పట్ట నష్టం అంచనా వేయాలని ఈ మేరకు వ్యవసాయ శాఖను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిందట. మరో 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ తర్వాత పంట నష్టం పై అంచనా వేయనుంది. ఇక ఎకరానికి 10000 చొప్పున ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చిందట. అయితే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఎన్నికల అధికారి అనుమతితో పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 50 వేల ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు సమాచారం అందుతుంది.