TG Politics: మల్లారెడ్డికి మరో షాక్‌… మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత

TG Politics: Another shock for Mallareddy... Tension in Mallareddy Engineering College
TG Politics: Another shock for Mallareddy... Tension in Mallareddy Engineering College

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో ఊహించని షాక్‌ తగిలింది. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గండి మైసమ్మలోని MREC క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

నిన్న రాత్రి పెట్టిన స్వీట్ లో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్ లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నా నిర్వహించారు. ఇక ఇప్పుడు నిన్న రాత్రి పెట్టిన స్వీట్ లో పురుగులు వచ్చాయని ఆందోళనకు దిగారు విద్యార్థులు. దీంతో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.