TG politics: ఈరోజు కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఎంపిక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్

TG politics: CM Revanth will hand over the selection papers to the constable candidates today
TG politics: CM Revanth will hand over the selection papers to the constable candidates today

తెలంగాణలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎంపిక పత్రాలను అభ్యర్థులకు అందజేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి – T.S.L.P.R.B….. 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేయగా గతేడాది అక్టోబరులోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది.

పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా, జైళ్ల, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాలకు సంబంధించి 16 వేల 604 పోస్టులకుగాను 12 వేల 866 మంది పురుషులు, 2,884 మంది మహిళ అభ్యర్ధులను ఎంపిక చేసింది. అర్హులు లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణించారు. పోలీస్ రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతోపాటు అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం న్యాయస్థానాల్లో వ్యాజ్యాల కారణంగా వెల్లడించలేదు. అయితే ఇంతకాలం న్యాయస్థానాల్లో వ్యాజ్యాల కారణంగా ఆలస్యం నెలకొంది. అడ్డంకులు తొలిగిపోవడంతో తాజాగా ఎంపిక పత్రాలను అందజేయాలని హోంశాఖ నిర్ణయించింది.