పాలకుర్తి రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పదవి ఏమో కోడలుది.. పెత్తనం ఏమో అత్తది అన్నట్లు పాలకుర్తి రాజకీయాలు కొనసాగుతున్నాయి. దీంతో పాలకుర్తి ఎమ్మెల్యేకు తల నొప్పిగా మారింది అత్త పెత్తనం. ఎలాంటి పదవి లేకున్నా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో తలదూరుస్తున్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ.
లోక్ సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలే కాదు సొంత పార్టీలో ఆమె మీద తిరుగుబాటు కూడా ఎదురైంది. అటు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి తీరుకి వ్యతిరేకంగా పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ వద్ద నిరసన చేపట్టారు.
ముఖ్యంగా దేవరుప్పుల మoడల పార్టీ అధ్యక్షుడు తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గాంధీ భవన్ ముందు నిరసనకు దిగారు నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తలు.పేరుకే ఎమ్మెల్యే యశిస్విని రెడ్డి అయినా పెత్తనం మాత్రం అత్త ఝాన్సీ రెడ్డి చేస్తుంది అంటున్నారు కార్యకర్తలు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న వారికి ప్రియారిటి ఇవ్వకుండా నిన్న మొన్న వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి ప్రియారిటి ఇస్తుందని కార్యకర్తలు పేర్కొంటున్నారు.