ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మా బడ్జెట్ కి అస్సలు గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు ఏ మాత్రం అడ్డంకి కావు అని డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ బడ్జెట్ ను శాసనసభలో ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
లోక్సభ ఎన్నికలకు ముందు కనుక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు. సుమారు 2.95 లక్షల రూపాయల వరకూ బడ్జెట్ అంచనాలను రూపొందించారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ఇది. సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ ను రూపొందించారు.