నల్లగొండ జిల్లా సాగర్ లో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ క్వార్టర్ ను మిర్యాలగూడ RTO సీజ్ చేసింది. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిని అధికారులు సీజ్ చేశారు.
అయితే.. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చినా.. క్వార్టర్ ను సీజ్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆగ్రహం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్యకర్తలు దిగారు.
అటు నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ క్యాంప్ కార్యాలయం సీజ్ పై స్పందించిన జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన..ఎన్నికల ప్రవర్తన నియమావళిని మాత్రమే అమలు చేశామన్నారు. క్యాంపు కార్యాలయాన్ని రాజకీయ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు కాబట్టే సీజ్ చేశామని స్పష్టం చేశారు.