TG Politics: రేపు కాంగ్రెస్ పార్టీలోకి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప

TG Politics: Former Sirpur MLA Konappa joins Congress party tomorrow
TG Politics: Former Sirpur MLA Konappa joins Congress party tomorrow

కొమురం భీం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. రేపు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు. కాగజ్ నగర్ లో మంత్రుల సమక్షంలో ఆయన, జడ్పి ఛైర్మెన్ కోనేరు కృష్ణ తో పాటు నియోజక వర్గంలోకి BRS పార్టీ క్యాడర్ కాంగ్రెస్ చేరనుంది.

ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. అటు కాసేపటి క్రితమే.. కోనప్ప ఇంటికి వెళ్ళి కలిశారు కాంగ్రెస్ నేతలు. నియోజక వర్గ నాయకులు రావి శ్రీనివాస్, డీ సీసీ అధ్యక్షులు విశ్వ ప్రసాద్ రావ్…కోనప్ప ఇంటికి వెళ్ళి కలిశారు. బీఎస్పీ – బీఆర్ఎస్‌ పొత్తును విభేధిస్తూ… సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప కాంగ్రెస్‌ చేరనున్నారు.