ఇటీవల జరిగిన కానిస్టేబుల్ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల ఉద్యోగాల భర్తకి సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి జరిగిన పరీక్షలు ఫలితాలను TSLPRB 2023 అక్టోబర్ 4న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఫలితాల్లో ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయింది. దీనికి సంబంధించిన పరీక్షల్లో పాలు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని వాటికి సంబంధించిన మార్కులు కలపాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో హైకోర్టు TSLPRB ని కానిస్టేబుల్ ఉద్యోగ నియమాకాల్ని తాత్కాలికంగా నిలిపివేసి తప్పుగా వచ్చిన ప్రశ్నలకు సంబంధించిన మార్కులు కలిపి మళ్ళీ ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది.దీంతో TSLPRB హైకోర్టు తీర్పు ను సహాయం చేస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించి తమ వాదనలో వినిపించింది. బోర్డు వాదనలతో ఏకీభవించిన కోర్టు TSLPRB కి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే అక్టోబర్ 4 2023న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలనే ఫైనల్ చేస్తూ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈనెల 12 నుంచి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతుంది.