ఆయిల్ ఫామ్ రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆయిల్ ఫాం, కొబ్బరి, కోకో మరియు మామిడి పంటల ప్రాసెసింగ్ యూనిట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆయిల్ ఫామ్ కంపెనీల ప్లాంటేషన్ వేగవంతం చేసి, వచ్చే సంవత్సరం పెద్దమొత్తంలో రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు మంత్రి తుమ్మల. ఫుడ్ పార్కులలో మౌళిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు మంత్రి తుమ్మల. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు మంత్రి తుమ్మల. మార్కెట్ యార్డులలో ఈ వేసవిలో రైతులకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు మంత్రి తుమ్మల.