TG Politics: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో భారీగా పెరుగుతున్న ఖాళీలు

TG Politics: Huge increase in Telangana RTC vacancies
TG Politics: Huge increase in Telangana RTC vacancies

తెలంగాణ ఆర్టీసీలో భారీగా ఖాళీలు నెలకొంటున్నాయి. పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతుండటంతో సంస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి. సంస్థలో పలువురు ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు. మార్చి నెలాఖరులో 176 మంది పదవీ విరమణ పొందారు. ఇక ఏప్రిల్‌ – డిసెంబరు మధ్య మరో 1,354 మంది రిటైర్‌ కానున్నట్లు సమాచారం. వీరిలో డ్రైవర్లు 403 మంది.. కండక్టర్లు 350 మంది ఉన్నారు.

ఇప్పటికే సంస్థలో భారీగా ఖాళీలున్నాయి. మంజూరైన పోస్టుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఫిబ్రవరి నాటికి.. కండక్టర్లు మినహా 9 విభాగాల్లో 25,965 శాంక్షన్డ్‌ పోస్టులుండగా, పనిచేస్తున్నవారి సంఖ్య 16,274గా ఉంది. అంటే 9,691 ఖాళీలున్నాయి. డ్రైవర్‌ పోస్టులు 22,174 కాగా, పనిచేస్తున్నది 14 వేల పైచిలుకు మాత్రమే. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాల సమాచారం. ఆర్టీసీలో ఫిబ్రవరి నెలాఖరు వరకు 17,410 మంది కండక్టర్లు ఉన్నారు. ఖాళీల భర్తీ ప్రతిపాదనల్లో కండక్టర్‌ పోస్టులు లేకపోవడం గమనార్హం.