నీటిపారుదల శాఖపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. వాటా తేలకుండా ఏపీకి గత ప్రభుత్వం కృష్ణా జలాలను అప్పగించడంపై సర్కార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
కృష్ణా జలాలపై కేసీఆర్ కు జగన్ ధన్యవాదాలు చెప్పడం తదితర వీడియో బైట్స్ ను ప్రదర్శించనుంది. అందుకోసం సభలో 2LED స్క్రీన్లు ఏర్పాటుచేశారు. ఈ రోజైనా కేసీఆర్ సభకు వస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇక అటు రేపు ‘ఛలో నల్గొండ’ సభను బీఆర్ఎస్ నిర్వహించబోతుంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో సభను బీఆర్ఎస్ పార్టీ తలపెట్టింది. అయితే…బీర్ఎస్ ‘ఛలో నల్గొండ’ సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనుందట కాంగ్రెస్ ప్రభుత్వం. మరికాసేపట్లోనే దీనిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం అందుతోంది.