TG Politics: గ్రూప్-1 అభ్యర్థులకు జాగ్రత్త.. ఇదే చివరి అవకాశం

TG Politics: Group-1 candidates beware.. this is the last chance
TG Politics: Group-1 candidates beware.. this is the last chance

రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టులను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.గ్రూప్-‌1 దరఖాస్తులలో దొర్లిన తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. ఈ మేరకు గ్రూప్-1 దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు టీఎస్పీఎస్సీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది.

ఇవాళ సా. 5 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. గ్రూప్‌-1 ఉద్యోగాల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో పేరు, పుట్టిన తేదీ, జెండర్‌, విద్యార్హతలు, ఫొటో, సంతకం వంటి వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని సరి చేసుకోవచ్చని పేర్కొన్నారు. 563 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 మెయిన్స్ పరీక్ష జరగనుంది.: https://www.tspsc.gov.in/ వెబ్సైట్ కి వెళ్లి ఎడిట్ చేసుకోవచ్చు.