TG Politics: శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు అంత‌ర్జాతీయ అవార్డు

TG Politics: International Award for Shamshabad Airport
TG Politics: International Award for Shamshabad Airport

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి అంత‌ర్జాతీయ పుర‌స్కారం ల‌భించింది. ప్ర‌యాణికుల‌కు ఉత్తమ సేవ‌లు అందిస్తున్నందుకు గాను ఈ పురస్కారం ల‌భించిన‌ట్లు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంట‌ర్నేష‌న‌ల్ (ఏసీఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్‌పోర్ట్ స‌ర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) విభాగంలో 2023 ఏడాదికి గాను ఆసియా-ప‌సిఫిక్ ప్రాంతంలో హైద‌రాబాద్ ఉత్త‌మ విమానాశ్ర‌యంగా నిలిచింద‌ని జీఎంఆర్ సంస్థ తెలిపింది.

ఏడాదికి 1.5 నుంచి 2.5 కోట్ల మంది ప్ర‌యాణికుల‌కు సేవ‌లు అందిస్తూ, ప్ర‌పంచంలోని 400 విమానాశ్ర‌యాలు ఈ అవార్డు కోసం పోటీ ప‌డ్డాయి. 30కి పైగా ప‌నితీరు సూచిక‌ల ఆధారంగా అంతిమ విజేత‌ను నిర్ణ‌యించారు.