ఈనెల 12 లేదా 13వ తేదీలలో కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీల మధ్య పొత్తు కుదిరింది. ఎంపీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే, BRSతో బీఎస్పీ ప్రవీణ్ కుమారు పొత్తు పెట్టుకోవడంతో BRSకు కోనేరు కోనప్ప గుడ్ బై చెప్పారు.
ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనేరు కోనప్పపై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. కులాల పేరుతో ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూషించాడని.. నన్ను వ్యక్తిగతంగా దూషించిన ప్రవీణ్ కుమార్ తో BRS పొత్తు పెట్టుకుంటారా ? అంటూ BRSకు కోనేరు కోనప్ప గుడ్ బై చెప్పారు. నన్ను కేసీఆర్ అవమాని0చాడు అంటూ ఫైర్ అయ్యారు. ఇక 12 లేదా 13 తేదీల్లో కోనేరు కోనప్ప కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.