TG Politics: బీజేపీ, BRS పార్టీల నేతలు తమపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారు: కడియం శ్రీహరి

TG Politics: Leaders of BJP and BRS parties are making endless accusations against them: Kadiam Srihari
TG Politics: Leaders of BJP and BRS parties are making endless accusations against them: Kadiam Srihari

లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో డైలాగ్ వార్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చిగడ్డి వేస్తే.. భగ్గుమనేలా కనిపిస్తోంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వరంగల్ BJP ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యపై కుల, మత పరమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కామెంట్స్ కి కడియం శ్రీహరి తాజాగా విలేకర్ల సమావేశంలో కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో బీజేపీ, BRS పార్టీల నేతలు తమపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాజకీయంగా తాను పెంచిన ఆరూరి చివరికి తనకే వెన్నుపోటు పొడుస్తున్నాడని పేర్కొన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరూరి రమేష్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశానని గుర్తు చేశారు. బీజేపీకి దళితులు, ముస్లింలు అంటే గిట్టదంటూ మండిపడ్డారు. ఆరూరి ఎస్సీ అయి ఉండి తన కూతరు పట్ల అనుచిన వ్యాఖ్యలు చేయడం బాధకరమన్నారు. దేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదని స్పష్టం చేశారు. తండ్రిది ఏ కులమో.. అదే కులం కన్నబిడ్డకూ వర్తిస్తుందని తెలిపారు. నేను ఆరూరిలా భూ కబ్జాలకు పాల్పడలేదని, తన జీవితం ఓ తెరచిన పుస్తకమని అన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ తననే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని కడియం శ్రీహరి అన్నారు.