TG Politics: అస్మిత కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ..!

TG Politics: MLC Kavitha Paramarsa for Asmita's family..!
TG Politics: MLC Kavitha Paramarsa for Asmita's family..!

ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవితా పరామర్శించారు. మోతే మండలం బురకచర్లలో ఎమ్మెల్సీ కవిత పరామర్శించడం జరిగింది. అస్మితకి నివాళులర్పించి కుటుంబానికి కవిత భరోసా ఇచ్చారు.

కవిత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణమే సమీక్ష నిర్వహించాలని అన్నారు ఇప్పటివరకు విద్యాశాఖ సాంఘిక సంక్షేమ శాఖకి మంత్రి లేరు హాస్టల్లో పర్యవేక్షణ లోపం ఉందన్నారు.