రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇటీవలే గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చిన సర్కార్ తాజాగా టెట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇలా వరుసగా ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సింగరేణి సంస్థ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 7 కేటగిరీల్లోని ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు CMD బలరాం. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
భర్తీ చేయనున్న పోస్టులివే..
ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో.. మేనేజ్మెంట్ ట్రైనీ(సిస్టమ్స్) ఈ2 గ్రేడ్- 7, మేనేజ్మెంట్ ట్రైనీ(ఈఅండ్ఎం) ఈ2 గ్రేడ్- 42.
నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో.. జూనియర్ మైనింగ్ ఇంజినీరు టీఅండ్ఎస్ గ్రేడ్ సీ- 100, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ(ఎలక్ట్రికల్) టీ అండ్ ఎస్ గ్రేడ్ సీ- 24, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1- 47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ-1- 98, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ(మెకానికల్) టీఅండ్ఎస్ గ్రేడ్ సీ- 9.