TG Politics: మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు.. 21 నుంచి ప్రారంభం

TG Politics: Special trains for Medaram fair will start from 21st
TG Politics: Special trains for Medaram fair will start from 21st

మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడాకం సమ్మక్క, సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్తాయని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ రైళ్లు సికింద్రాబాద్-వరంగల్, నిజామాబాద్-వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ మార్గంలో నడుస్తాయని ఆయన పేర్కొన్నారు.

మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు..21 నుంచి ప్రారంభం
బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రాంతాల్లోని భక్తులకు.. ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. ‘నరేంద్రమోదీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందులో భాగంగానే.. సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం రూ.3కోట్లను కేటాయించింది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Special trains for Medaram fair

07017/07018: సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్-సిర్పూర్ కాగజ్‌నగర్
07014/07015: సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్
07019/07020: నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్