తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచె ని తొలగించిందని చెప్పారు. ప్రజా భవన్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు ఆరు గ్యారెంటీ లకి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని త్వరలో మరో రెండు గ్యారెంటీలని అమలు చేస్తామని ఆమె చెప్పారు.
అర్హులైన వారికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించామని చెప్పారు. రైతులు మహిళలు యువతకు ఇచ్చిన హామీలు కి కట్టుబడి ఉంటామని ఆమె చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి మాకు అప్పగించారని అన్నారు మూసీ నదిని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తామని గవర్నర్ పేర్కొన్నారు.