ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. దేశానికి సేవ చేయాలనే మా మంత్రం.. “సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్” అని ఆయన అన్నారు. దేశం కోసం మేం అదే ఆలోచనతో ముందుకు సాగుతామన్నారు. అధికారం దక్కించుకోవడానికి పగలు రాత్రి ఆటలు ఆడే వారు కుటుంబ అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెడతారని విమర్శించారు. “పరివార్‌కే సాత్, పరివార్ కా వికాస్” వాళ్ల నినాదం అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు.