మనం ధోనీకి ఎంత గౌరవం ఇస్తామో అతను కూడా మనకు అంత గౌరవం ఇస్తాడు. అందుకే అతన్ని గొప్ప సారథి అంటారు అని ఇర్ఫాన్ పఠాన్ ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు. మహేంద్ర సింగ్ ధోనీపట్ల ప్రతి ఒక్కఅభిమానికిఎంతో గౌరవం ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తనదైన బ్యాటింగ్ శైలితో, నాయకత్వంతోటీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఘనత ధోనీ సొంతమని పఠాన్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఐపీఎల్ సమయంలో ఇర్ఫాన్ మీడియాతో మాట్లాడుతూ తాను ధోనీ నాయకత్వంలో చాలా మ్యాచ్‌లు ఆడానని, యువ ఆటగాళ్లపై ధోనీ చూపించే అభిమానం వేరేలా ఉంటుంది.
ఎవరైనా సరే ధోనీ వద్దకు ఎప్పుడైనా వెళ్లి చాలా ఫ్రీగా మాట్లాడొచ్చు. మొదటిసారి జట్టులోకి వచ్చిన వాళ్లైనా సరే. మనం అతనికి ఎంత గౌరవం ఇస్తామో అతడు అంతే గౌరవమిస్తాడని చెప్పుకొచ్చాడు. ధోనీ మన మాటలు వినేందుకు అసలు వెనుకాడడు అని మనపై ఫుల్ అటెన్షన్ ఉంచుతాడుని ఎందుకంటే అప్పుడే కొత్తగా జట్టులోకి వచ్చి ఉన్నవారికి ఇది మరింత బూస్ట్ ఇస్తుందని చెప్పుకొచ్చాడు. కోపంగా, ముభావంగా ఎప్పుడూ ఉండడని అందుకే ధోనీని గొప్ప కెప్టెన్ అంటారు’ అని పఠాన్ తెలిపాడు.