బీజేవైఎం మరియు స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 129వ జన్మదిన వేడుకలు పటాన్చెరులో ఘనంగా జరిగింది

బీజేవైఎం మరియు పటాన్చెరు స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ భీమరావు రామ్‌జీ అంబేద్కర్ గారి 129వ జన్మదినాన్ని పురస్కరించుకొని, పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేవైఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి నాగసాని నవీన్ రాజ్ మరియు పట్టణ స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు, భాజపా నాయకులు నాగసాని నరేష్ కుమార్ రాజ్ మాట్లాడుతూ అంబేద్కర్ గారు భారతీయ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా మరియు సామాజిక సంస్కర్తగా, దళిత బౌద్ధ ఉద్యమాన్ని ప్రేరేపించారు మరియు అంటరానివారి (దళితుల) పట్ల సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆయన స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి చట్టం మరియు న్యాయశాఖ మంత్రిగా, భారత రాజ్యాంగం యొక్క ప్రధాన వాస్తుశిల్పిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారన్నారు.
అదేవిధంగా ఆయన మొట్టమొదట “షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్” అనే రాజకీయ పార్టీని స్థాపించి వారి యొక్క హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేశారని, అదే రకంగా కొన్ని ఇతర రాజకీయ సంబంధిత పార్టీలు,”ఇండిపెండెంట్ లేబర్ పార్టీ” మరియు “రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా” వంటి పార్టీలతో తన అనుబంధాన్ని కొనసాగించారని,ఆయన దేశానికి చేసినటువంటి అనేక మైన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల యువసేన ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు నీరుడి వీరాస్వామి గారు,రాష్ట్ర మాల యువసేన కార్యదర్శి బాబురావు గారు,పటాన్చెరు బిజెపి బూత్ అధ్యక్షులు సాయికుమార్ గారు,బీజేవైఎం మరియు వివేకానంద యువజన సంఘం నాయకులు-  కార్యకర్తలు లక్ష్మణ్ యాదవ్, రమేష్,సురేష్,రవీందర్ శ్రీకాంత్,రవి తదితరులు పాల్గొన్నారు.