పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన కూటమి.. అనుకున్నట్టుగానే గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి 74 మంది మద్దతును కూడ గట్టుకుని.. మేయర్ హరి వెంకటకుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గింది కూటమి.. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. త్వరలోనే కొత్త మేయర్‌ను ఎన్నుకుని విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.