నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

late monsoon

నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యంకానుంది. రుతుపవనాలు ఈ నెల 8న కేరళను తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనావేయగా ఇప్పుడు మరో రెండ్రోజులు ఆలశ్యం కానుందని సమాచారం. ఐఎండీ మునుపటి అంచనాలతో పోలిస్తే మరో రెండు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. రుతుపవనాలు రెండ్రోజుల్లో కేరళలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ అధికారుల సమాచారం. ఈ లెక్కన ఈ నెల 8న కేరళ తీరాన్ని తాకే అవకాశముంది. కేరళ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చే సరికి 3రోజులు సమయం పట్టనుంది. ఏపీని 11న, తెలంగాణను 13న రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1 నాటికి మూడునాలుగు నాలుగు రోజులు అటు ఇటుగా కేరళలోకి ప్రవేశిస్తాయి. ఐతే ప్రతికూల వాతావరణం కారణంగా ఈసారి మరో మూడు రోజులు ఆలస్యం కానున్నాయి. రుతుపవనాలు ఆలస్యంగా రావడం అసాధారణమేమీ కాదన్న వాతావరణ శాఖ ప్రస్తుతం కురుస్తున్న వానలతో వాతావరణం చల్లబడుతుందని తెలిపింది. క 13న దక్షిణ తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి బుధవారం వెల్లడించారు. రెండు రోజులు అటూ ఇటూగా కూడా ఉండొచ్చని ఆయన తెలిపారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోకి ఈనెల 11న ప్రవేశించే అవకాశం ఉందన్నారు. నిజానికి 6వ తేదీనే నైరుతి రుతుపవనాలు వస్తాయని, 11న తెలంగాణకు రావొచ్చని.. జూన్‌-సెప్టెంబరు నడుమ దీర్ఘకాల సగటుతో పోలిస్తే 96 శాతం మేర సాధారణ వర్షాలు పడతాయని ఐఎండీ కొద్దిరోజుల క్రితం అంచనా వేసింది. కానీ, అనుకున్న దానికంటే మరో రెండు ఆలస్యంగా రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది.